సూపర్‌స్టార్ ప్రశంసపై 'సిల్వర్‌స్టార్' సింధు ఉప్పొంగిపోతోంది. ...
- August 24, 2016
సూపర్‌స్టార్ ప్రశంసపై 'సిల్వర్‌స్టార్' సింధు సూపర్‌స్టార్ ప్రశంసకు సిల్వర్‌స్టార్ ముగ్ధురాలైపోయింది. మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉందని ఉప్పొంగిపోతోంది. ఒలింపిక్స్ క్రీడాచరిత్రలోనే రజత పతకాన్ని సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సిల్వర్‌స్టార్ సింధుని ప్రశంసిస్తూ 'నేను నీ అభిమానినయ్యా' అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే పతకం గెల్చిన నాటి నుంచి ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిన సింధుకి కాస్త తీరిక దొరకడంతో బుధవారం ట్విట్టర్‌ను తెరచింది. ఇంకేముంది అందులో రజనీకాంత్ ట్వీట్ చూసి పట్టరాని ఆనందానికి లోనైంది.'సార్.. థాంక్యూ సో మచ్ సార్.. మాటలు రావడం లేదు. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు లేవు' అంటూ రీట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







