ప్రాణం
- October 11, 2026
ఎవరు ఏమిటి అనే భావన కన్నా
ఎందరో అందరిని నావారనుకున్న
మనసున తెగింపుతో సాధించాలనుకున్న
మానవత్వం మరువక ముందుకు సాగాలనుకున్న,,
కష్టము వచ్చిన జరిగే పరిణామాలు పసిగట్టిన
కంటి ఎదుట జరిగే సంఘటనకి చలించిన
కూడబలుక్కున్న ధైర్యం ఒంటరిగా పోరాడిన
కల్లోలం సృష్టించిన భీతావాహ పరిస్థితులు ఎదురించిన,,
కసిని గుర్తించి ఎదురొడ్డి నిలిచిన
కదనరంగంలో సైనికుడిలా అడుగు ముందుకు వేసి
కత్తిపోటు కన్న పొడిచిన వెన్నుపోటు తో
కఠిన పాషాణ దుశ్చర్యకి కళ్ళెం వేసి
కారే రుధిరము సైతము లెక్కచేయక,,,
కర్తవ్యమే ధ్యేయంగా ఫలితం ఆలోచించక
అచంచల ఆత్మవిశ్వాసం అధ్భుతమైన సాహసము
జనుల ప్రాణాలు గగనతలంలో నే కొడిగట్టక
జనులహృదయాల్లో నిలచిన జనులని కాపాడిన
చివరికి గెలుపుతో ఊపిరిపీల్చుకున్న ఓవీరుడా
ఆపదని చాకచక్యంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని
కన్నీటిచుక్కలని ఆనందభాష్పాలుగా మార్చిన
భరతమాత బిడ్డగా భారతీయతకే గర్వకారణంగా
వీరోచితంగా పోరాడి వీరత్వానికి సజీవ సాక్ష్యంగా,,
వృత్తికన్న బాధ్యతతో వ్యవహరించిన ధీశాలి
ప్రతిప్రాణానికి పెద్దపీట వేసిన ధైర్యవంతుడు
నీవయ్యా కథానాయకుడు నీ సమయస్ఫూర్తే
యావత్ మానవాళికి ఆదర్శమయ్యే నీ సాహసం,,,
అందరి జీవనాల్లో ఆశాజ్యోతి వెలిగించిన
భారత పౌరుడు మచ్ఛర్..
--యామిని కోళ్ళూరు ✍️
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







