అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- October 11, 2026
అబుదాబి: అరేబియా గల్ఫ్‌లో ప్రయాణిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రమాదంలో చిక్కుకున్న 22 మంది సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నేషనల్ గార్డ్‌కు చెందిన కోస్ట్‌గార్డ్ బృందం సురక్షితంగా రక్షించింది. ట్యాంకర్‌లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది నుంచి సమాచారం అందడంతో కోస్ట్‌గార్డ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. ప్రమాద స్థలానికి చేరుకుని నౌకలో ఉన్న 22 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వీరంతా ఆసియా దేశాలకు చెందిన వారని నేషనల్ గార్డ్ తెలిపింది. రక్షించిన సిబ్బందికి తొలుత ప్రథమ చికిత్స అందించిన అనంతరం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
గతంలోనూ పలుమార్లు సహాయక చర్యలు
సముద్రంలో ప్రమాదాలకు గురైన నౌకల సిబ్బందిని యూఏఈ అధికారులు గతంలోనూ రక్షించారు. గత ఏడాది జూన్ 17న గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మరో నౌకను ఢీకొన్న అడాలిన్ (ADALYNN) ఆయిల్ ట్యాంకర్‌లోని 24 మంది సిబ్బందిని కోస్ట్‌గార్డ్ రక్షించింది. వారిని ఖోర్ ఫక్కన్ నౌకాశ్రయానికి తరలించారు. అదే ఏడాది జూన్ 4న యూఏఈ జలాల్లో ఓ ఆయిల్ ట్యాంకర్‌లో గాయపడిన సిబ్బందిని వైద్య సహాయం కోసం హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మే 18న సముద్రంలో మునిగిపోతున్న ఓ విహార నౌక నుంచి 13 మందిని కూడా నేషనల్ గార్డ్ రక్షించింది. తాజా ఘటనలో 22 మంది ప్రాణాలను కాపాడటంతో సముద్రంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు యూఏఈ చేపడుతున్న సహాయక చర్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







