సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- October 12, 2026
రియాద్: రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబర్ 11న జరిగిన దాడిలో ఓ పాకిస్థానీ వ్యక్తి మరణించగా, మరో 11 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) వెల్లడించింది.
దాడిలో గాయపడిన వారిని వెంటనే పలు ఆసుపత్రులకు తరలించి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాడి కారణంగా విమానాశ్రయంలో ఆస్తులకు జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ ఆదివారం రాత్రి రియాద్ విమానాశ్రయంపై గత 24 గంటల్లో దాడులు జరిపినట్లు ప్రకటించింది. తమ సైనిక ప్రతినిధి యాహ్యా సరీఅ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, మొత్తం నాలుగు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ దాడుల్లో రియాద్ విమానాశ్రయంతో పాటు దమ్మామ్ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీ ప్రతినిధి తెలిపారు. అలాగే సౌదీ ప్రభుత్వ చమురు సంస్థ సౌదీ అరామ్‌కోకు చెందిన రెండు కేంద్రాలపై కూడా దాడులు చేసినట్లు ప్రకటించారు.
ఈ ఘటనతో సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం, భద్రతా చర్యలపై అధికారుల నుంచి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







