ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!

- October 12, 2026 , by Maagulf
ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!

దోహా: ఖతార్‌లోని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కీలక నిర్ణయం తీసుకుంది. తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌ ద్వారా అందించే సేవల ఫీజుల చెల్లింపునకు Apple Pay, Google Pay సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త చెల్లింపు విధానాల ద్వారా వినియోగదారులు తమ సేవల ఫీజులను మరింత వేగంగా, సులభంగా చెల్లించవచ్చని వెల్లడించింది.

ఇప్పటికే మంత్రిత్వ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ అప్లికేషన్‌లో ఈ చెల్లింపు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించే వారికి మరిన్ని చెల్లింపు ఎంపికలు లభించనున్నాయి. డిజిటల్ సేవల వినియోగాన్ని సులభతరం చేయడం, చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులను తగ్గించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com