రియాద్​ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్​ వాసి మృతి

- October 12, 2026 , by Maagulf
రియాద్​ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్​ వాసి మృతి

రియాద్: ఉద్యోగరిత్యా హైదరాబాద్​కు చెందిన యూసుఫ్​ సౌదీలో ఉంటున్నారు. భార్యాపిల్లల్ని చూసేందుకు ఈ నెల ఇంటికి వచ్చారు. మదినాను దర్శించుకోవాలనే ఉద్దేశంతో యూసుఫ్​ కుటుంబ సభ్యులను తీసుకుని సౌదీకి వెళ్లారు. ఇక్కడ వరకు అంతా బాగుంది. ఎప్పుడైతే వీరు మదినాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చారో అప్పుడే అంతా తారుమారయ్యింది. విమానాశ్రయంలో ఆకస్మిక మిస్సైల్​ దాడి జరిగింది. దాంట్లో యూసుఫ్​తోపాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఘటనలో యూసుఫ్​ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు. యూసుఫ్​ మృతి పట్ల ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపినట్టు ఓవైసీ పేర్కొన్నారు. ఈ మేరకు అసదుద్దీన్‌ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com