ఒమన్‌, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!

- October 13, 2026 , by Maagulf
ఒమన్‌, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!

మస్కట్‌: ఒమన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ బదర్‌ బిన్‌ హమద్‌ అల్‌ బుసైదీ, అర్మేనియా విదేశాంగ మంత్రి అరరత్‌ మిర్జోయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమన్‌, అర్మేనియా దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు, పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, సహకారాన్ని విస్తరించే మార్గాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

అలాగే, పరస్పర ఆసక్తి ఉన్న పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా భద్రత, శాంతిని ప్రోత్సహించేందుకు చేపడుతున్న ప్రయత్నాలపైనా ఇరువురు విదేశాంగ మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com