యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్‌లో బీభత్సం..!!

- October 13, 2026 , by Maagulf
యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్‌లో బీభత్సం..!!

యూఏఈ: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన కురిశాయి. ముఖ్యంగా అల్ ఐన్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టార్మ్ సెంటర్‌ షేర్ చేసిన వీడియోల్లో అల్ ఐన్‌లోని అల్ వతన్ స్ట్రీట్, హట్టా రోడ్డుపై భారీగా వర్షం కురిసింది.

రహదారులపై వడగళ్లు పడటంతో పాటు, వర్షపు నీరు విండ్‌షీల్డ్‌పై పడుతుండగా వాహనదారులకు రోడ్డు స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. అలాగే, రస్ అల్ ఖైమాలోని షౌకా ప్రాంతంలో కూడా వర్షం కురిసింది. యూఏఈలోని దుబాయ్, షార్జా, అల్ ఐన్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ముందుగానే అలెర్ట్ జారీ చేసింది.

పర్వత ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని NCM హెచ్చరించింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.  వర్షాల సమయంలో రహదారులపై విజిబిలిటీ తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు వేగాన్ని నియంత్రించుకోవాలని, భద్రతా సూచనలు పాటించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com