మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- October 16, 2026
హైదరాబాద్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఐదేళ్ల చిన్నారి హత్య కేసు, బొల్లారం ఆయుధాల చోరీ కేసు, పెరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాల నేపథ్యంలో ఇన్స్పెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశమై నేరాల పరిస్థితిని సమీక్షించారు.
మొత్తం నేరాలు 9.23 శాతం పెరుగుదల
కమిషనరేట్ పరిధిలో మొత్తం నేరాలు 9.23 శాతం పెరిగినట్లు సమీక్షలో వెల్లడైంది. అయితే సైబర్ నేరాలు 38.5 శాతం, ఆర్థిక నేరాలు 35.3 శాతం, వ్యవస్థీకృత నేరాలు 69 శాతం తగ్గడం గమనార్హం. మరోవైపు ఇతర విభాగాల్లో నేరాల సంఖ్య పెరగడంపై డీజీపీ ఆరా తీశారు.
సంచలనం సృష్టించిన కేసులు, పోక్సో కేసులు, మహిళలపై జరుగుతున్న నేరాలను ప్రత్యేకంగా సమీక్షించారు. జోన్లు, పోలీస్ స్టేషన్ల వారీగా నేరాల గణాంకాలను విశ్లేషించి, నేరాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసుల పనితీరులోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాత్రి గస్తీ, నిఘా పెంచాలి
రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, ప్రజలకు పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా నిఘా పెంచాలని డీజీపీ ఆదేశించారు. దొంగలు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే తరహా ప్రమాణాలతో పట్టణ పోలీసింగ్‌ను అమలు చేయాలని, నేరాలు జరిగిన వెంటనే వేగంగా స్పందించాలని స్పష్టం చేశారు.
సైబర్ నేరాల దర్యాప్తును మరింత బలోపేతం చేయడంతో పాటు, అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు







