సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- October 16, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కంపెనీలకు చెందిన 3,108 కార్లను రికాల్ చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2025 మోడల్ వాహనాల్లో ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ (EGR) వాల్వ్‌లో లోపం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. ఈ ప్రాబ్లమ్ కారణంగా వాహనాల వేగం పెరిగే సామర్థ్యం తగ్గిపోవచ్చని, డ్రైవింగ్ సమయంలో ఇంజిన్ శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది.
ఏయే కార్లను వెనక్కి పిలుస్తున్నారు?
ఈ రీకాల్ పరిధిలో 2025 మోడల్‌కు చెందిన కింది వాహనాలు ఉన్నాయి.
- ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్ (Ford Explorer)
- ఫోర్డ్ టారస్ (Ford Taurus)
- లింకన్ నాటిలస్ (Lincoln Nautilus)
- లింకన్ కోర్సెయిర్ (Lincoln Corsair)
ఉచితంగా మరమ్మతులు
రీకాల్ పరిధిలోకి వచ్చే వాహనాల యజమానులు సంబంధిత స్థానిక డీలర్లను సంప్రదించి అవసరమైన మరమ్మతులు ఉచితంగా చేయించుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
సంప్రదించాల్సిన డీలర్లు, ఫోన్ నంబర్లు:
- అల్ జజీరా వెహికల్స్ ఏజెన్సీస్ కంపెనీ: 8007492222
- మొహమ్మద్ యూసుఫ్ నగీ మోటార్స్ కంపెనీ: 8001240218
వాహనాల్లోని లోపాన్ని సకాలంలో సరిచేయించుకోవడం ద్వారా డ్రైవింగ్ సమయంలో తలెత్తే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు సూచించారు. సౌదీ అరేబియాలో ఈ నాలుగు మోడళ్ల కార్లను వినియోగిస్తున్నవారు తమ వాహనం రీకాల్ పరిధిలోకి వస్తుందో లేదో సంబంధిత డీలర్లను సంప్రదించి నిర్ధారించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు







