సినిమా రివ్యూ: ‘రణబాలి’.!

- October 16, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘రణబాలి’.!

విజయ్ దేవరకొండ-రష్మిక కాంబినేషన్‌లో రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. ప్రమోషన్లు నెక్స్‌ట్ లెవల్ ‌ చేశారు. ట్రైలర్‌తో సహా ప్రచార చిత్రాలన్నీ బాగా ఆకట్టుకున్నాయ్. మరి, విజయ్ - రష్మికల క్రేజీ కాంబినేషన్.. అందులోనూ వారి వివాహం తర్వాత వచ్చిన కాంబినేషన్ మూవీ కావడంతో అంచనాలు బాగా వున్నాయ్ ఈ సినిమాకి. మరి, ఆ అంచనాల్ని అందుకోవడంలో ‘రణబాలి’ విజయం సాధించిందా.? లేదా.? తెలియాలంటే ‘రణబాలి’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
19వ వ శతాబ్ధం నాటి రాయలసీమ నేపథ్యమే ఈ కథకు మూలం. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ రూలింగ్‌లో వుండగా రాయలసీమ భయంకరమైన కరువుతో తల్లడిల్లింది. అయినా కానీ, పన్ను కట్టమంటూ ప్రజల్ని పీడించుకు తినేవాడు అప్పటి ప్రాంతానికి కమిషనర్‌గా వున్న సర్ థియెడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ ఓస్లూ). పన్ను కట్టనివాళ్ల ధాన్యాన్ని పోర్టుల నుంచి తరలిస్తుండేవాడు. అలా ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని పోర్టు నుంచి తరలించి తను వున్న స్థాయికి మరో పెద్ద పదవిని సొంతం చేసకోవాలని అనుకుంటాడు. ఈ నేపథ్యంలో కరువుతో ప్రజలు చచ్చిపోతున్నా.. పట్టించుకోడు. అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుంటాడు. జనం వందల కొద్దీ చనిపోతున్న విషయం ఆ ప్రాంత పాలెగాడు శింగనమల బొబ్బిలి రణబాలి(విజయ్ దేవరకొండ)కు తెలుస్తుంది. రాక్షసుడిలాంటి బ్రిటీస్ దొరకు  ఎదురు తిరుగుతాడు. ఈ క్రమంలో రణబాలి ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.? జయమ్మ (రష్మిక మండన్నా) పాత్ర ఎలాంటి ప్రభావం చూపించింది. శింగనమల గుహలో కొన్ని వందల ఏళ్ల క్రితం జీవ సమాధి అయిపోయిన భద్ర మల్లన్న తాతకీ, రణబాలికీ ఏంటి సంబంధం.? ఇవన్నీ తెలియాలంటే ‘రణబాలి’ సినిమా థియేటర్లలో చూడాలి.

ఇంతవరకూ రొమాంటిక్, మాస్, కమర్షియల్ సినిమాలతోనే మెప్పించిన విజయ్ దేవరకొండ తొలిసారిగా పీరియాడిక్ డ్రామాలో నటించాడు ఈ సినిమా కోసం. అందుకు ఆయన తనను మార్చుకున్న విధానం, మేకోవర్ చాలా బాగుంది. ముఖ్యంగా యుధ్ధ ఘట్టాల్లో విజయ్ దేవరకొండ చూపించిన ఆహార్యం, హావ భావాలు తెరపై చాలా బాగా పండాయి. అలాగే, జయమ్మగా రష్మిక పాత్ర ఈ సినిమాకి చాలా కీలకం. బ్రిటీస్ దొరల క్రూరమైన పాలన నుంచి ప్రజల్ని కాపాడడానికి భర్త రణబాలి చేసే పోరాటానికి తాను అండగా నిలబడడం.. అలాగే భార్యగా ఆమె పండించిన ఎమోషన్.. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ముఖ్యంగా జయమ్మ పాత్రలో రష్మిక ఒదిగిపోయిన తీరు.. అన్నీ చాలా బాగా ఆకట్టుకుంటాయ్. ఆ తర్వాత ముఖ్యమైన పాత్ర ‘మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ కుస్లూ. బ్రిటీష్ దొరగా అప్పటి హెక్టార్ ఎలా వున్నాడో తెలీదు కానీ.. అచ్చం ఇలాగే వుండి వుంటడా.? అనేంతలా ఈ పాత్రలో ఒదిగిపోయాడాయన. రణబాలి తల్లిగా ఈశ్వరీరావు పాత్ర మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేర నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:
తాను అనుకున్న కథని చాలా నిజాయితీగా తెరపై ప్రజెంట్ చేయడంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యాడు. అయితే.. నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని వుండి వుంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇలాంటి పీరియాడిక్ సినిమాలకి మ్యూజిక్ ప్రధాన బలం అవ్వాలి. అయితే, భీకరమైన యాక్షన్ ఘట్టాల్లో కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తేలిపోయింది. ‘ఏందయ్యా సామీ..’, ‘రణబాలి’ టైటిల్ సాంగ్స్ మెప్పిస్తాయంతే. ఎడిటింగ్ విషయంలో కొన్ని లోపాలున్నాయ్. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయ్. అనవసరమైన టైమ్ వేస్ట్ సన్నివేశాల్లా అనిపిస్తాయ్. వాటికి కత్తెర వేసే అవకాశమున్నా ఎందుకో డేర్ చేయలేదు. అలాగే సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలు తెలిసిన సన్నివేశాల్లానే అనిపిస్తాయ్. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ పెద్ద ప్లస్ అవ్వాలి. అది ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పొచ్చు. 19వ శతాబ్ధం కాలం నాటి కరువు ప్రపంచాన్ని బీడు బారిన నేలను చాలా నేచురల్‌గా కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే, అప్పటి నేటివిటీని, ప్రజలు, పాలకుల కాస్ట్యూమ్స్ చక్కగా సెట్ చేశారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్, రష్మిక పర్‌ఫామెన్స్ అండ్ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ, ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్‌లోని దైవత్వానికి సంబంధించిన సన్నివేశాలు మొదలైనవి.

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో కొన్ని సాగతీత సన్నివేశాలు, యాక్షన్ ఘట్టాల్లో కొన్ని చోట్ల తేలిపోయిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్..

చివరిగా:
‘రణబాలి’ విజయ్ దేవరకొండకు ఇదో సరికొత్త బ్రేక్. ఈ రణబాలి ధియేటర్లలో కొన్ని చోట్ల ఖచ్చితంగా మెప్పిస్తాడు.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com