అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- October 17, 2026 , by Maagulf
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అబుదాబి: తెలంగాణ పల్లెలు అన్నీ అబుదాబికి కదలి వచ్చినయా ! అన్నట్టుగా అనుభూతి కలిగేలా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అబుదాబి వారు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

శుక్రవారం ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అబుదాబి వేదికగా జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కౌన్సలర్ ఆఫ్ ఎంబసీ ఇండియా సౌమ్య గుప్తా, గౌరవ అతిథిగా డాక్టర్ బాలాజీ రామస్వామి కౌన్సలర్ ఆఫ్ ఇండియా ఎంబసీ, ప్రత్యేక అతిథిగా దాస్యం అభినవ్ బిజెపి ఎన్.ఆర్.ఐ కన్వీనర్ తెలంగాణ, ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు బిజి  థామస్ మరియు వివిధ రాష్ట్రాల వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని బతుకమ్మ వేడుకలు ఆసాంతం తిలకించి పులకించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మహిళలు  బతుకమ్మలను తయారు చేసి తీసుకువచ్చారు. 

సంప్రదాయ నృత్యాలతో 4 గంటల పాటు కొనసాగిన ఈ ఉత్సవాలలో మహిళలు, యువతులు , చిన్నారులు   ప్రత్యేక నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించారు. ఇండియా నుండి వచ్చిన ప్రముఖ కళాకారుడు డాక్టర్ కోకిల నాగరాజు నృత్య దర్శకత్వంలో రూపొందించిన ఈ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇండియా నుండి వచ్చిన గాయకులు , డాన్సర్లు అంజలి పులింటి, సోనీ యాదర్ల, సోనీ పటేల్ లు తమ ఆటపాటలతో అలరించారు. అబుదాబి లో నివసించే కవీష్, సంజన, అభిరామ్ లు చక్కటి బతుకమ్మ పాటలతో అందరిని అలరించారు.

రాము గౌడ్ కుటుంబ సభ్యులు రూపొందించిన 12 అడుగుల బతుకమ్మ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలు తయారుచేసి తీసుకొచ్చిన మహిళలకు , సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులకు  ప్రత్యేక బహుమతులు నిర్వాహకులు అందించారు. " మన తెలంగాణ సంప్రదాయాన్ని , సంస్కృతిని పరిరక్షించడం కోసమే గత పది సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవం మరియు వివిధ పండుగలకు అందరినీ ఏకం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు TFA అధికార ప్రతినిధి రాజా శ్రీనివాస రావు, అన్నారు. ఈ కార్యక్రమం కోసం పరిశ్రమించిన మహిళ ప్రతినిధులు  పావని, అర్చన, పద్మజ , నిధి, వాహిని , ప్రణతి . మిగతా మహిళ ప్రతినిధులను సౌమ్య గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. వేల సంఖ్యలో ప్రజలు హాజరైన ఈ సంబరాలలో యూఏఈ దేశ మహిళలు సైతం పాల్గొని ఆడి పాడడం విశేషంగా ఆకట్టుకుంది.అందరికీ భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో TFA ప్రతినిధులు శ్రీనివాస్ , గంగారెడ్డి, వంశీ , అశోక్ , జగదీశ్ , గోపినాథ్ , తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com