బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్

- October 17, 2026 , by Maagulf
బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్

హైదరాబాద్:  తెలంగాణలోని ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల కర్నె వినయ్ తీవ్రమైన బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కేటీఆర్‌ను స్వయంగా కలవాలనేది ఆ బాలుడి చిరకాల కోరిక. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, వినయ్ కుటుంబసభ్యులను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి వారి భేటీని ఏర్పాటు చేశారు.

భయపడొద్దు.. మేమున్నాం: ధైర్యం చెప్పిన కేటీఆర్
ఈ సందర్భంగా బాలుడు వినయ్‌ను కేటీఆర్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాలుడి పరిస్థితిని అడిగి తెలుసుకుని, “ఏమీ భయపడొద్దు, ధైర్యంగా ఉండు” అని కొండంత అభయాన్ని ఇచ్చారు. వినయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి పూర్తి భరోసానిచ్చారు.

బాలుడి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల మెరుగైన వైద్య చికిత్సలను అందిస్తామని, వైద్య ఖర్చులకు సంబంధించి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ చూపిన మానవతా దృక్పథంపై బాలుడి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com