కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!

- October 18, 2026 , by Maagulf
కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!

కువైట్ : కువైట్‌లో ఆరు పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించి మోడల్ పోలీస్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 18 నుంచి ఆయా స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్టేషన్లలో నిర్వహణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమయంలో పోలీస్ సేవలకు అంతరాయం కలగకుండా ప్రజల కోసం ప్రత్యామ్నాయ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

మూసివేస్తున్న స్టేషన్లు.. ప్రత్యామ్నాయ కేంద్రాల వివరాలు

1. క్యాపిటల్ గవర్నరేట్: అల్-షామియా పోలీస్ స్టేషన్‌కు బదులుగా కైఫాన్ పోలీస్ స్టేషన్‌లో సేవలు పొందవచ్చు.

2. అల్-జహ్రా గవర్నరేట్: అల్-ఖస్ర్ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా అల్-నయీమ్ పోలీస్ స్టేషన్ పనిచేస్తుంది.

3. ఫర్వానియా గవర్నరేట్: ఫర్వానియా పోలీస్ స్టేషన్‌కు బదులుగా ఒమారియా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి.

4. ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్: ముబారక్ అల్-కబీర్ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా అబు ఫుతైరా పోలీస్ స్టేషన్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి.

5. హవల్లీ గవర్నరేట్: అల్-షుహదా పోలీస్ స్టేషన్‌కు బదులుగా అల్-సిద్దిఖ్ పోలీస్ స్టేషన్‌లో సేవలు పొందవచ్చు.

6. అల్-అహ్మదీ గవర్నరేట్: సబా అల్-అహ్మదీ నార్త్ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా సబా అల్-అహ్మదీ సౌత్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి.

పోలీస్ స్టేషన్లలో నిర్వహణ, ఆధునికీకరణ పనులు పూర్తయ్యే వరకు ప్రజలు తమకు కేటాయించిన ప్రత్యామ్నాయ పోలీస్ స్టేషన్లను సందర్శించి అవసరమైన సేవలు పొందాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com