సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- October 18, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నేపథ్యంలో నాలుగు ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జజాన్, అసీర్, అల్ బహా, మక్కా ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు వడగళ్ల వాన, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. గాలుల కారణంగా దుమ్ము, ఇసుక వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.
జజాన్, అసీర్, అల్ బహా, మక్కా ప్రాంతాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు ప్రావిన్స్‌లోని తీర ప్రాంతాల్లోనూ పొగమంచు కమ్ముకునే సూచనలు ఉన్నాయని పేర్కొంది.ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ వాతావరణ కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







