ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!

- October 18, 2026 , by Maagulf
ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!

మస్కట్: ఒమన్‌లోని నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పలువురు ప్రవాస మహిళలను రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అరెస్ట్ చేసింది.

ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన మహిళలను నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మహిళలపై చట్టపరమైన చర్యలు చేపట్టే ప్రక్రియ కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com