టర్కీలో వరుస బాంబు దాడులు హోర్రెత్తుతున్నాయి..
- August 26, 2016
టర్కీలో వరుస బాంబు దాడులు హోర్రెత్తుతున్నాయి. ఆగ్నేయ టర్కీలోని పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఖుర్దీష్ ఉగ్రవాదులు జరిపిన కారుబాంబు దాడిల్లో 9 మంది పోలీసులు మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రీకాప్ అక్ డ్యాగ్ తెలిపారు. కానీ మరణాల సంఖ్యపై ఇంకా క్లారిటీ లేదని టర్కీస్ అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కుర్దిష్ సిర్ నాక్ ప్రావిన్స్ ప్రాంతంలో పోలీసు ప్రధాన కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది.
పేలుళ్ల ధాటికి పోలీసు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. కుర్దిష్ వర్కర్స్ పార్టీనే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అథారిటీలు అనుమానిస్తున్నాయి.పోలీసులను, మిలటరీ వాహనాలను, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టు అధికారులు పేర్కొన్నారు. 12 అంబులెన్స్ లు, రెండు హెలికాప్టర్లను సహాయక చర్యల నేపథ్యంలో దాడి జరిగిన ప్రాంతానికి పంపినట్టు ఆరోగ్య మంత్రి చెప్పారు. కుర్దిష్ వర్కర్స్ పార్టీకి, సెక్యురిటీ ఫోర్స్ లకు మధ్య గతేడాది నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







