దమ్మాం విమానాశ్రయ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి..!!
- October 24, 2026
దమ్మాం: సౌదీ అరేబియాలోని దమ్మాం కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించినట్లు తూర్పు ప్రావిన్స్ హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. దమ్మాంలోని సౌదీ జర్మన్ ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం బాధితుడు మృతి చెందినట్లు వెల్లడించింది. బుధవారం జరిగిన దాడిలో గాయపడిన బాధితుల్లో ఒకరికి ఆసుపత్రి వైద్య సేవలు అందించిన తీరుపై సోషల్ మీడియాలో పలు ఆరోపణలు రావడంతో ఆరోగ్య శాఖ స్పందించింది.
ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై విచారణ జరిపినట్లు తూర్పు ప్రావిన్స్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. బాధితుడి వైద్య రికార్డులను పరిశీలించడంతో పాటు, ఆసుపత్రి అనుసరించిన చికిత్సా విధానాలను సమీక్షించినట్లు వెల్లడించింది. దాడిలో గాయపడిన వ్యక్తిని సౌదీ జర్మన్ ఆసుపత్రిలో చేర్చుకున్న వెంటనే అవసరమైన వైద్య చికిత్స అందించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో బాధితుడు ఆసుపత్రిలోనే మరణించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతరం మరణ నమోదు, అంత్యక్రియలకు సంబంధించిన అధికారిక ప్రక్రియలను పూర్తి చేసేందుకు మృతదేహాన్ని దమ్మాం మెడికల్ కాంప్లెక్స్‌కు తరలించినట్లు వివరించారు. కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబర్ 21న జరిగిన దాడిలో ఇద్దరు మరణించినట్లు సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) గతంలో ధ్రువీకరించింది.
తాజా వార్తలు
- రెండు బాలిస్టిక్ మిస్సైల్స్, రెండు డ్రోన్లు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో భారత నూతన రాయబారికి ICRF ఘన స్వాగతం..!!
- ఖతార్‌లోని సీలైన్, ఖోర్ అల్ అదీద్ బీచ్ వద్ద రాకపోకలపై నిషేధం..!!
- దమ్మాం విమానాశ్రయ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి..!!
- మార్చి 24 నుంచి ఏప్రిల్ 3 వరకు మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన
- దమ్మామ్ విమానాశ్రయ దాడిలో మృతి చెందిన భారతీయుడి కుటుంబంతో సంప్రదింపులు.. ఇండియన్ ఎంబసీ
- మహిళల విజయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బంపర్ ఆఫర్లు
- అమితాబ్ బచ్చన్ నివాసం, మేయర్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపులు
- ఉమ్ అల్ కువైన్ సమీపంలో చమురు లీకేజీ.. అల్ హమ్రియా బీచ్‌ను తాత్కాలికంగా మూసివేత







