అరబ్ రీడింగ్ ఛాలెంజ్..అక్టోబర్ 29న దుబాయ్‌లో తుది వేడుకలు..!!

- October 25, 2026 , by Maagulf
అరబ్ రీడింగ్ ఛాలెంజ్..అక్టోబర్ 29న దుబాయ్‌లో తుది వేడుకలు..!!

దుబాయ్‌: అరబ్‌ ప్రపంచంలో పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘అరబ్‌ రీడింగ్‌ ఛాలెంజ్‌’ పదో ఎడిషన్‌ విజేతలను అక్టోబర్ 29న ప్రకటించనున్నారు. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జరిగే ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. రీడింగ్, విజ్ఞానం ద్వారా యువతను తీర్చిదిద్దడం మెరుగైన భవిష్యత్తుపై పెట్టుబడి వంటిదని పేర్కొన్నారు.  

60 దేశాల నుంచి 4 కోట్ల మంది విద్యార్థులు

మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ గ్లోబల్‌ ఇనిషియేటివ్స్‌ ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. పదో ఎడిషన్‌లో 60 దేశాల నుంచి 4 కోట్ల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విభాగంలో 74,062 మంది ఉన్నారు. గత తొమ్మిదో ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి విద్యార్థుల భాగస్వామ్యం 24 శాతం పెరిగింది. అరబ్‌ ప్రపంచంలోని మొత్తం పాఠశాల విద్యార్థుల్లో 48 శాతం మంది ఈ పోటీలో పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 

విజేతలకు భారీ నగదు బహుమతులు

అక్టోబర్ 29న జరిగే ముగింపు వేడుకల్లో వివిధ విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
- అరబ్‌ రీడింగ్‌ ఛాలెంజ్‌ విజేత: మొదటి బహుమతి Dh500,000, రెండో బహుమతి Dh100,000, మూడో బహుమతి Dh70,000.
- ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విభాగం: మొదటి బహుమతి Dh200,000, రెండో బహుమతి Dh100,000, మూడో బహుమతి Dh50,000.
- ఉత్తమ పాఠశాల: మొదటి బహుమతి Dh1 మిలియన్‌, రెండో బహుమతి Dh500,000, మూడో బహుమతి Dh300,000.
- ఉత్తమ పర్యవేక్షకుడు: మొదటి బహుమతి Dh300,000, రెండో బహుమతి Dh100,000, మూడో బహుమతి Dh50,000.

- కమ్యూనిటీ ఛాంపియన్‌: మొత్తం Dh200,000 బహుమతులు. మొదటి బహుమతి Dh100,000, రెండో బహుమతి Dh70,000, మూడో బహుమతి Dh30,000.
ఈ పోటీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం Dh110 మిలియన్ల బహుమతులు అందజేశారు. ప్రతి ఏడాది విజేతలకు Dh11 మిలియన్ల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com