ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!
- October 25, 2026
దోహా: ఖతార్‌లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ‘వర్షం తర్వాత మీరు ఏం చేయాలి?’ అనే శీర్షికతో విడుదల చేసిన ఇన్ఫోగ్రాఫిక్లో నీరు సక్రమంగా బయటకు వెళ్లేలా చూడాలని, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, పరిసరాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.
అదే సమయంలో అవసరమైతే కీటకాలు, ఎలుకల నియంత్రణ సేవల కోసం OUN యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది. దోమల వ్యాప్తిని అరికట్టి, పరిసరాలను సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!
- అరబ్ రీడింగ్ ఛాలెంజ్..అక్టోబర్ 29న దుబాయ్‌లో తుది వేడుకలు..!!
- భారత్-కువైట్ దౌత్య సంబంధాలకు 65 ఏళ్లు.. మొక్కలు నాటిన భారతీయులు..!!
- తెలంగాణ టీజీ ఐపాస్ పై సైబర్ దాడి
- భద్రతా మండలిలో వీటో అధికారాలపై ఆంక్షలు విధించాలి..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఆరోగ్య బీమా నిబంధనలు..!!
- ఒమన్‌లో కార్మికుల నివాసాలపై ఆంక్షలు..!!
- రక్షణ రంగంలో తెలంగాణను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
- సౌదీ అరేబియాలో క్షిపణుల అవశేషాలు..మక్కా, జెడ్డా, తాయిఫ్‌లో పడిన శకలాలు
- అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ







