దుబాయ్‌లో వాహనదారులకు అలర్ట్..!!
- October 26, 2026
దుబాయ్: డ్రైవర్ రహిత ట్యాక్సీల పరీక్షల నేపథ్యంలో దుబాయ్‌లోని కీలక రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఎమిరేట్స్ రోడ్ (E611)పై అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న మూడు లేన్లను మూసివేయనున్నారు. అలాగే అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయ టన్నెల్‌ను రెండు వైపులా పూర్తిగా మూసివేయనున్నారు. ఈ మేరకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఆంక్షలు అక్టోబర్ 26 నుంచి 31 వరకు, ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని RTA సూచించింది.
యూఏఈలో ఆటోమెటిక్ గా నడిచే వాహనాల వినియోగాన్ని విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 10,000కు పైగా డ్రైవర్ రహిత ట్యాక్సీలు, డెలివరీ వ్యాన్లు అందుబాటులో ఉండనున్నట్లు ఈ నెల ప్రారంభంలో ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వాహనాల కోసం ఇప్పటికే ఆర్డర్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు.
అబుదాబి, దుబాయ్ నగరాల్లో ఇప్పటికే డ్రైవర్ రహిత ట్యాక్సీల వాణిజ్య సేవలు ప్రారంభమయ్యాయి. దుబాయ్‌లో ఉమ్ సుఖీమ్, జుమైరా వంటి ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లోనూ లెవల్ 4 స్వయంచాలక ట్యాక్సీ సేవలను విస్తరించారు. డ్రైవర్ అవసరం లేకుండా నడిచే లెవల్ 4 వాహనాల వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని తొలి నగరంగా అబుదాబి నిలిచిందని అబుదాబి మొబిలిటీ సంస్థ గతంలో వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెజిల్ ఎన్నికల్లో లూలా డా సిల్వా చారిత్రాత్మక విజయం
- చైనా వీసా ప్రక్రియలో మార్పులు
- ఖతార్‌లో నివాసితులకు గుడ్‌న్యూస్..!
- సౌదీ అరేబియాలో కనీస వేతన పరిమితి పెంపు..!!
- మస్కట్‌లో ఇండియా–ఒమన్ ఆయుష్ కేంద్రం ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..!!
- దుబాయ్‌లో వాహనదారులకు అలర్ట్..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ పట్టివేత..!
- బంగాళాఖాతంలో బీభత్సం..ఏపీకి భారీ వర్షాల ముప్పు!
- ఇజ్రాయెల్ ఎన్నికలకు అంతరాయం కలిగిస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక







