చైనా వీసా ప్రక్రియలో మార్పులు

- October 26, 2026 , by Maagulf
చైనా వీసా ప్రక్రియలో మార్పులు

చైనా పర్యటనకు ప్రణాళికలు రచిస్తున్న భారతీయ ప్రయాణికులకు ఒక ముఖ్యమైన గమనిక వచ్చింది. అక్టోబర్ 26, 2026 నుండి అమలులోకి వచ్చేలా భారతదేశంలో చైనీస్ వీసా దరఖాస్తు విధానంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విప్లవాత్మక మార్పులను ప్రకటించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మూడవ పక్ష (VFS) వీసా దరఖాస్తు కేంద్రాల వ్యవస్థను రద్దు చేస్తూ.. దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నేరుగా తమ దౌత్య కార్యాలయాల పరిధిలోకి తీసుకువచ్చింది. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం (Embassy) మరియు ముంబైలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు ఇకపై నేరుగా వీసా, కాన్సులర్ లీగలైజేషన్ దరఖాస్తులను స్వీకరిస్తాయి.

ఆన్‌లైన్ అప్లికేషన్ & డాక్యుమెంట్ అప్‌లోడ్

ఈ నూతన విధానం అమల్లోకి రావడంతో న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో ప్రస్తుతం సేవలందిస్తున్న చైనీస్ వీసా దరఖాస్తు కేంద్రాలు కొత్త అప్లికేషన్లను స్వీకరించడం తక్షణమే నిలిపివేస్తాయి. అయితే, ఇప్పటికే ఈ కేంద్రాలలో పత్రాలను ప్రాసెస్ చేయించుకున్న దరఖాస్తుదారులు అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు తమ పాస్‌పోర్ట్‌లను అక్కడి నుండి సేకరించడానికి వెసులుబాటు కల్పించారు.- ఆన్‌లైన్ నుండి ఎంబసీ సమర్పణ వరకు step-by-step వివరాలు: మొదటి దశ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుంది. ప్రయాణికులు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక కాన్సులర్ పోర్టల్‌ను సందర్శించి దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి. అవసరమైన సహాయక పత్రాలను (Supporting Documents) అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ సమీక్ష (Online Review) కోసం సమర్పించాలి. ఇమెయిల్ నోటిఫికేషన్ & 30 రోజుల గడువు: ఆన్‌లైన్ ప్రాథమిక పరిశీలన పూర్తయి ఆమోదం లభించిన తర్వాత, దరఖాస్తుదారులకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com