'భోగి’ డబ్బింగ్ పూర్తి చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
- October 26, 2026
చార్మింగ్ స్టార్ శర్వా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కందుల సులోచన రాణి పాత్రలో ఆమె ఫస్ట్ లుక్, పాటల్లో ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు డింపుల్ హయాతి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
ఈ సినిమా నవంబర్ 12న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి
సాంకేతిక బృందం
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కిశోర్ కుమార్ అరోకియా
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పీఆర్వో: వంశీ–శేఖర్
తాజా వార్తలు
- కువైట్‌లో మంత్రి హత్యకు కుట్ర.. ముగ్గురికి మరణశిక్ష
- దుబాయ్‌లో ఏఐ రంగానికి భారీ ప్రోత్సాహం..
- కొత్త రూపంలో దుబాయ్ ఫౌంటెన్.. బుర్జ్ లేక్‌లో ఆకట్టుకుంటున్న వెండి నిర్మాణాలు
- ఆర్థిక సంబంధాల బలోపేతంపై కువైట్–భారత్ చర్చలు..!!
- సౌదీ అరేబియా రక్షణ రంగంలో కీలక పురోగతి..!!
- మస్కట్–ముంబై.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం..!!
- బహ్రెయిన్‌లో ‘ట్రీ వీక్’ నిర్వహించిన న్యూ ఇండియన్ స్కూల్..!!
- 2027లో సరికొత్తగా దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!
- ఖతార్‌లో ‘బైతి బైతక్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- రామమందిరానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శన వేళల్లో మార్పులు!







