హైదరాబాద్‌లో తొలిసారిగా ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్
- October 28, 2026
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహించనున్న మూడో ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026–27కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (CAPFs) చెందిన సుమారు 35 పోలీసు జట్లు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.
ఏర్పాట్ల పై డీజీపీ సమీక్ష
టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి రవాణా, వసతి, భద్రత, సాంకేతిక సహకారం తదితర కీలక అంశాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమ నిర్వహణ కోసం సుమారు 10 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీకి నిర్దిష్ట బాధ్యతలు అప్పగించి, పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసు బలగాల మధ్య స్నేహభావానికి వేదిక
ఈ టోర్నమెంట్ కేవలం క్రికెట్ పోటీలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పోలీసు బలగాల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని డీజీపీ పేర్కొన్నారు. క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు పోలీసు శాఖల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించేందుకు ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు దోహదపడతాయని తెలిపారు.
మైదానంలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్న డీజీపీ
టోర్నమెంట్‌పై తనకున్న ఆసక్తిని కూడా డీజీపీ సీవీ ఆనంద్ వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో తాను కూడా మైదానంలోకి దిగి క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి పోలీస్ టీ20 టోర్నమెంట్ ద్వారా తెలంగాణ పోలీస్ శాఖకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు, పోలీసు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి మరింత పెంపొందుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్‌లో క్షిపణి శకలాల కలకలం..!!
- యూఏఈ వెళ్లే భారతీయులకు కీలక సూచనలు..!!
- ప్రపంచ ఇంధన భద్రత బలోపేతానికి ఖతార్ నిరంతర కృషి..!!
- ఒమన్‌లో బయటపడ్డ ప్రాచీన సమాధులు..!!
- బహ్రెయిన్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర.. ముగ్గురికి జీవిత ఖైదు..!!
- కువైట్ అమిర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సోషల్ మీడియా యూజర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- హైదరాబాద్‌లో తొలిసారిగా ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్
- ఫ్లైదుబాయ్ సిబ్బందికి జాయెద్ II ప్రథమ శ్రేణి పురస్కారం
- ఫ్లైదుబాయ్ సిబ్బందికి జాయెద్ మెడల్.. సాహసానికి యూఏఈ అధ్యక్షుడి ప్రశంసలు
- తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !!







