బహ్రెయిన్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర.. ముగ్గురికి జీవిత ఖైదు..!!
- October 28, 2026
మనామా: బహ్రెయిన్ రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నడం, ఉగ్రవాద సంస్థలో చేరి దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులకు అక్కడి హై క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ విషయాన్ని ఉగ్రవాద నేరాల విభాగం డిప్యూటీ చీఫ్ ప్రాసిక్యూటర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రానికి సంబంధించి BD1,313 మొత్తాన్ని, స్వాధీనం చేసుకున్న ఇతర వస్తువులను జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
బహ్రెయిన్‌లో ప్రజా శాంతికి భంగం కలిగించడం, జాతీయ భద్రత, ప్రజల రక్షణ, ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించడం లక్ష్యంగా ఓ ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నుతున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సమాచారం అందింది. ఈ సమాచారంపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ముగ్గురు నిందితులు సదరు ఉగ్రవాద సంస్థలో చేరినట్లు, బహ్రెయిన్ ప్రయోజనాలకు హాని కలిగించే కుట్రల్లో భాగస్వాములైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వ్యక్తులకు హాని చేయడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, ప్రభుత్వ సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటి లక్ష్యాలతో ఈ కుట్రలు సాగినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, బహ్రెయిన్ పరిధిలో వివిధ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు నిందితులకు బాధ్యతలు అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది.
ఎలక్ట్రానిక్ పరికరాల పరిశీలనతో కీలక ఆధారాలు
సమాచారం అందిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది. నిందితులను ప్రశ్నించడంతో పాటు, వారి నుంచి వివరణాత్మక వాంగ్మూలాలు సేకరించింది. సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణులను నియమించింది. ఈ పరికరాల పరిశీలనలో నిందితులపై మోపిన అభియోగాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితులను హై క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం, చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ నిందితులకు న్యాయవాదుల సహాయం అందించడం, తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించడం వంటి రక్షణ చర్యలను నిర్ధారించింది. అనంతరం జరిగిన విచారణలో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- రియాద్‌లో క్షిపణి శకలాల కలకలం..!!
- యూఏఈ వెళ్లే భారతీయులకు కీలక సూచనలు..!!
- ప్రపంచ ఇంధన భద్రత బలోపేతానికి ఖతార్ నిరంతర కృషి..!!
- ఒమన్‌లో బయటపడ్డ ప్రాచీన సమాధులు..!!
- బహ్రెయిన్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర.. ముగ్గురికి జీవిత ఖైదు..!!
- కువైట్ అమిర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సోషల్ మీడియా యూజర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- హైదరాబాద్‌లో తొలిసారిగా ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్
- ఫ్లైదుబాయ్ సిబ్బందికి జాయెద్ II ప్రథమ శ్రేణి పురస్కారం
- ఫ్లైదుబాయ్ సిబ్బందికి జాయెద్ మెడల్.. సాహసానికి యూఏఈ అధ్యక్షుడి ప్రశంసలు
- తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !!







