కువైట్‌ అమిర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియా యూజర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష..!!

- October 28, 2026 , by Maagulf
కువైట్‌ అమిర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియా యూజర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష..!!

కువైట్‌: కువైట్‌ అమిర్‌ అధికారాలను సవాలు చేస్తూ, ఆయనను అవమానించేలా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టులు చేసిన వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ స్టేట్‌ సెక్యూరిటీ అండ్‌ టెర్రరిజం క్రైమ్స్‌ కోర్టు తీర్పునిచ్చింది.కువైట్‌ అమిర్‌ హిస్‌ హైనెస్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన అధికారాలను బహిరంగంగా ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టినట్లు నిందితుడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో స్టేట్‌ సెక్యూరిటీ అధికారులు నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం న్యాయస్థానంలో విచారణ జరిగింది.

ఎక్స్‌ పోస్టులపై అభియోగాలు

అమిర్‌ హక్కులు, అధికారాలను బహిరంగంగా సవాలు చేయడం, వ్యక్తిగతంగా అవమానించడం, ఆయన హోదాను కించపరిచేలా రాతపూర్వక వ్యాఖ్యలు చేయడం వంటి అభియోగాలను పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ నిందితుడిపై మోపింది. ఈ వ్యాఖ్యలను నిందితుడు తన ఎక్స్‌ ఖాతాలో ప్రచురించినట్లు పేర్కొంది.కౌన్సిలర్‌ నాసర్‌ అల్‌ బదర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. కౌన్సిలర్లు ఒమర్‌ అల్‌ ములైఫీ, అబ్దుల్లా అల్‌ ఫాలెహ్‌, సలేం అల్‌ జాయెద్‌ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. విచారణ అనంతరం నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com