స్మార్ట్ డివైజెస్‌పై డిహెచ్ఎ హెచ్చరికలు
- August 26, 2016
దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), స్మార్ట్ డివైజెస్ వినియోగదారులకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది. స్మార్ట్ డివైజెస్ వాడకంతో కంటి సమస్యలు తలెత్తుతున్నట్లు డిహెచ్ఎ తెలిపింది. చాలా ఎక్కువగా స్మార్ట్ డివైజెస్‌కి అడిక్ట్ అయితే శాశ్వతంగా బ్లైండ్నెస్ కూడా వచ్చే అవకాశం ఉందని డిహెచ్ఎ వర్గాలు హెచ్చరించాయి. దుబాయ్ హాస్పిటల్‌కి చెందిన కంటి వైద్య నిపుణుడు (ఆప్తాల్మలజిస్ట్) డాక్టర్ తాఫిక్ అన హకిమ్ మాట్లాడుతూ, పలు రకాలైన కంటి సమస్యలతో తమ వద్దకు స్మార్ట్ డివైజెస్ వినియోగదారులు వస్తున్నారనీ, వారిలో మయోఫియా, గ్లకోమా, కాటరాక్ట్, స్ట్రాబిస్మస్, అంబ్లియోపియా, కెరాటోకోనస్ తదితర సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా వారిలో ఉంటున్నారని చెప్పారు. ఆరు నుంచి ఎనిమిదేళ్ళ మధ్య వయసు చిన్నారులకు తప్పనిసరిగా కంటి వైద్య పరీక్షలు చేయించాలని ఆయన సూచించారు. డిహెచ్ఎ ఆధ్వర్యంలో స్మార్ట్ క్లీనిక్, అన్ని వయసుల వారికీ కంటి వైద్యం విషయంలో అనేక వైద్య సేవల్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







