ప్రపంచ ఇంధన భద్రత బలోపేతానికి ఖతార్‌ నిరంతర కృషి..!!

- October 28, 2026 , by Maagulf
ప్రపంచ ఇంధన భద్రత బలోపేతానికి ఖతార్‌ నిరంతర కృషి..!!

దోహా: LNG పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఖతార్‌.. ప్రపంచ ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తుందని ఆ దేశ అమిర్‌ హిస్‌ హైనెస్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ స్పష్టం చేశారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ష్యా రాజధాని మాస్కోలో జరిగిన గ్యాస్‌ ఎగుమతి దేశాల ఫోరం (GECF) సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని అమిర్‌ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

ప్రపంచ గ్యాస్‌ మార్కెట్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు, వాటిని అధిగమించడానికి సమష్టి ప్రయత్నాల అవసరాన్ని వివరించేందుకు ఈ సదస్సు మంచి అవకాశాన్ని కల్పించిందని వెల్లడించారు. NG పరిశ్రమలో ఖతార్‌ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ప్రపంచ ఇంధన భద్రతకు మరింతగా తోడ్పడుతుందని అమిర్‌ పునరుద్ఘాటించారు. అలాగే, పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రయోజనాల ప్రాతిపదికన అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com