ఖతార్‌లో ఆర్లా ప్రోటీన్ పుడ్డింగ్ బ్యాచ్‌ల రీకాల్..!!

- October 29, 2026 , by Maagulf
ఖతార్‌లో ఆర్లా ప్రోటీన్ పుడ్డింగ్ బ్యాచ్‌ల రీకాల్..!!

దోహా: గాజు ముక్కలు ఉండే అవకాశం ఉందన్న ఆందోళనతో ఆర్లా ప్రోటీన్ పుడ్డింగ్ ఉత్పత్తులలో మూడు బ్యాచ్‌లను ఖతార్ మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ దేశ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ రీకాల్ చేపట్టినట్లు బుధవారం వెల్లడించింది. డెన్మార్క్‌లో తయారైన ఈ ఉత్పత్తులను తయారీ సంస్థ ఆర్లా ఫుడ్స్ స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్‌లో విక్రయించిన మూడు రకాల ప్రోటీన్ పుడ్డింగ్‌లకు ఈ రీకాల్ వర్తిస్తుందని పేర్కొంది.

రీకాల్ చేసిన ఉత్పత్తుల వివరాలు ఇవే..

- చాక్లెట్ ఫ్లేవర్డ్ ప్రోటీన్ పుడ్డింగ్ (200g): బ్యాచ్ నంబర్ ES26284003, గడువు తేదీ మే 5, 2027.
- సాల్టెడ్ కారమెల్ ఫ్లేవర్డ్ ప్రోటీన్ పుడ్డింగ్ (200g): బ్యాచ్ నంబర్ ES26276002, గడువు తేదీ ఏప్రిల్ 30, 2027.
- హేజల్‌నట్ లాట్టే ఫ్లేవర్డ్ ప్రోటీన్ పుడ్డింగ్ (200g): బ్యాచ్ నంబర్ ES26247001, గడువు తేదీ ఫిబ్రవరి 18, 2027.
ఈ మూడు బ్యాచ్‌లలో చిన్న గాజు ముక్కలు ఉండే అవకాశం ఉందని, అవి వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది.

మార్కెట్‌ నుంచి పూర్తిగా తొలగించే చర్యలు

ప్రభావిత ఉత్పత్తులను విక్రయ కేంద్రాలన్నింటి నుంచి ఉపసంహరించేలా ఆహార భద్రత విభాగం తయారీ సంస్థ, స్థానిక సరఫరాదారులు, పంపిణీదారులతో సమన్వయం చేసుకుంటోంది. స్థానిక మార్కెట్‌లోకి ఇప్పటికే సరఫరా చేసిన ఉత్పత్తుల పరిమాణాన్ని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రీకాల్ చేసిన ఉత్పత్తులు ఇకపై సరఫరా కాకుండా, విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖతార్‌లో అందుబాటులో ఉన్న ఆహార ఉత్పత్తుల భద్రతను నిర్ధారించేందుకు అవసరమైన నియంత్రణ చర్యలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com