జయేశ్ రంజన్ బదిలీ
- October 28, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ బదిలీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకోనున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు మెట్రోపాలిటన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (Special Chief Secretary) బాధ్యతలు నిర్వర్తించిన జయేశ్ రంజన్‌ను… పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖల స్పెషల్ సీఎస్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల్లో కీలక పాత్ర పోషించిన ఆయన శాఖను మార్చడం ఐఏఎస్ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.
పాలనాపరమైన ప్రక్షాళన- 13 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్
రంజన్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం మరో 12 మంది (మొత్తం 13 మంది) సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి (PR&RD) శాఖ స్పెషల్ సీఎస్‌గా నవీన్ మిట్టల్ నియమితులయ్యారు. అలాగే రెవెన్యూ (దేవాదాయ/ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్‌కు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పరిపాలనా వేగాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, విఆర్ఎస్ వార్తల నేపథ్యం వల్ల జయేశ్ రంజన్ బదిలీ విషయం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది.
తాజా వార్తలు
- స్పెయిన్‌లో ఘోర రైళ్లు ప్రమాదం..68 మంది దుర్మరణం
- వరద సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
- చమురు లీకేజీ ప్రభావం..షార్జాలో అన్ని బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత
- జయేశ్ రంజన్ బదిలీ
- ఏపీకి మరో 7 రోజుల పాటు భారీ వర్ష సూచన
- యూఏఈలో ఆరోగ్య రంగ ప్రముఖులకు ఘన సత్కారం
- రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!
- ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- కువైట్‌లో విదేశీ ఇంజినీర్లకు ఊరట..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక టవర్..!!







