సంస్కృతి సమాజాలను కలిపే వారధి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

- October 29, 2026 , by Maagulf
సంస్కృతి సమాజాలను కలిపే వారధి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌: సంస్కృతి అనేది ఒక ప్రాంతానికో, సమాజానికో పరిమితం కాకుండా ప్రజల జీవన విధానాలు, సంప్రదాయాలు, విలువలను ప్రతిబింబిస్తుందని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. విభిన్న సంగీత సంప్రదాయాలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే గొప్ప భావనకు నిదర్శనమని పేర్కొన్నారు.

సౌత్‌ ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (SICA) ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతి లో నిర్వహించిన 68వ వార్షిక కళోత్సవానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక, హిందుస్థానీ సంగీత సంప్రదాయాలు భారతీయ సంగీత వైభవాన్ని చాటుతున్నాయని తెలిపారు. సంగీతం నిరంతరం అభివృద్ధి చెందాలని, సంప్రదాయాలను పరిరక్షిస్తూనే యువ కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు.
1969లో స్థాపించిన SICA హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో సంగీతాభిమానులకు విశేష సేవలందిస్తోందని గవర్నర్‌ ప్రశంసించారు. వర్ధమాన కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొంటూ, సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో SICA అధ్యక్షుడు డాక్టర్‌ చక్రవర్తి, కార్యవర్గ సభ్యులు, సంగీత కళాకారులు, సంగీతాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com