ఖతార్‌లో మై ఆపిల్ రెస్టారెంట్‌ పై కొరడా..!!

- October 29, 2026 , by Maagulf
ఖతార్‌లో మై ఆపిల్ రెస్టారెంట్‌ పై కొరడా..!!

దోహా: ఆహారాన్ని అపరిశుభ్రమైన పరిస్థితుల్లో అందించిన కారణంగా ఖతార్‌లోని అల్ వక్రాలో ఉన్న మై ఆపిల్ రెస్టారెంట్‌ను మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 30 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది.  ఈ మేరకు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2026 నాటి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం నంబర్ 168 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

మానవ ఆహార నియంత్రణకు సంబంధించిన 1990 నాటి చట్టం నంబర్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు ఎక్కడైనా గుర్తిస్తే ప్రజలు 184 నంబర్‌లో యూనిఫైడ్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని లేదా మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com