ఇరాన్‌లోని పరారీలో ఉన్న ఉగ్రవాదులకు సహకారం..ముగ్గురికి జీవిత ఖైదు

- November 03, 2026 , by Maagulf
ఇరాన్‌లోని పరారీలో ఉన్న ఉగ్రవాదులకు సహకారం..ముగ్గురికి జీవిత ఖైదు

21 మిలియన్లకు పైగా బహ్రెయిన్ దినార్ల నగదు, ఆస్తుల స్వాధీనం

మనామా: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ఇరాన్‌లో తలదాచుకున్న పరారీలో ఉన్న వ్యక్తులకు ఆర్థికంగా సహకరించడం, అనుమతి లేకుండా విదేశీ మారక లావాదేవీలు నిర్వహించడం, అక్రమంగా సంపాదించిన సొమ్మును మనీలాండరింగ్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన ముగ్గురికి బహ్రెయిన్ న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది.

ఈ కేసులో నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు విధించగా, మిగిలిన వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధించింది. అంతేకాకుండా నేరాల ద్వారా సంపాదించినట్లు గుర్తించిన 21 మిలియన్లకు పైగా బహ్రెయిన్ దినార్ల నగదు, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

అనుమతి లేకుండా మనీ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు నిర్వహించడం, అక్రమంగా నిధుల బదిలీలు చేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు అందించినట్లు కేసులో వెల్లడైంది.

దేశ భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించడం, అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించడం వంటి నేరాలపై బహ్రెయిన్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com