మలేషియా: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- November 05, 2026
కౌలాలంపూర్: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (టీం) ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ షటిల్ స్మాష్ సీజన్ 3 ఇటీవల కౌలాలంపూర్‌లోని WP Sentul కోర్ట్ లో రెండు రోజుల పాటు నిర్వహించబడినది .
మలేషియాలోని తెలుగు సమాజంలో క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందించే లక్ష్యంతో టీం గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 10వసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు విశేష స్పందన లభించింది. ఈ పోటీల్లో 200కు పైగా జట్లు, 215 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం విశేషం. పిల్లలు, మహిళలు, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, వెటరన్స్ డబుల్స్ తదితర పలు విభాగాల్లో పోటీలు నిర్వహించబడ్డాయి. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు హాజరై ఈ క్రీడా సంబరానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.
ఈ 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన నిర్వహణ కమిటీ సభ్యులు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు, వాలంటీర్లు, స్పాన్సర్లు, క్రీడాకారులు, ప్రేక్షకులు మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి టీం అధ్యక్షుడు అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే కేవలం టీం క్రీడా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రజల మధ్య ఐక్యత, సాంస్కృతిక అనుబంధం, పరస్పర సహకారం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మరియు సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు విచ్చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలను అందజేసి అభినందించారు. విజేతల ఆనందోత్సాహాలు, క్రీడాకారుల ఉత్సాహం, ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్ ఒక గొప్ప క్రీడా వేదికగా నిలిచింది.
టీం అధ్యక్షుడు అనిల్ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహణ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో ఈ టోర్నమెంట్‌ను అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. క్రీడా సమన్వయకర్తలు సుబాని, చందు టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు . టీం ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్ రావు, జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్, మీడియా కోఆర్డినేటర్ శశి, డిప్యూటీ ఆనంద్, మహిళా సమన్వయకర్త ప్రత్యూష తదితర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమ విజయానికి తమ వంతు సహకారాన్ని అందించారు.
తాజా వార్తలు
- మలేషియా: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- GymNation launches AED 1 million Foundation to back local talent, communities and wellness innovation
- నవంబర్ 5న ఖతార్‌లో వర్షం కోసం ప్రార్థనలు..
- మహిళల ప్రీమియర్ లీగ్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
- అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ
- యూట్యూబ్ చూసి ఫేక్ కరెన్సీ తయారీ..
- ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో భారత్ నౌకలకు మినహాయింపు
- ప్రపంచ రికార్డు సాధించిన విరాట్ కోహ్లి
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!







