పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026..
- November 05, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి భారీగా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026' నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సును ఘనంగా నిర్వహించనున్నారు.
సమ్మిట్ ఏర్పాట్ల పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026.. పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎక్స్‌పోలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖ సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ వెల్లడించారు. సదస్సులో భాగంగా రక్షణ, ఫార్మా, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ప్రత్యేక ఎక్స్‌పోలతో పాటు నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా 'స్టార్టప్ పెవిలియన్' ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ షో, క్లైమేట్ కాంక్లేవ్
సందర్శకులు, పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏరోబాటిక్ ఎయిర్ షో, పర్యావరణ పరిరక్షణపై క్లైమేట్ కాంక్లేవ్, విద్యారంగ అభివృద్ధిపై ఎడ్యుకేషన్ సమ్మిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడంతో పాటు 'రైజింగ్ తెలంగాణ' దార్శనికతలో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేయడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని సీఎస్ పేర్కొన్నారు.
సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. భద్రత, రవాణా, వసతి తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- జోర్డాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026..
- యూఏఈలో ప్రారంభమైన 11.11 మెగా సేల్.. 90 శాతం వరకు భారీ డిస్కౌంట్లు!
- సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి చేసినట్లు హౌతీల ప్రకటన
- ఒమన్‌లో అక్రమంగా ప్రవేశించిన 17 మంది అరెస్ట్
- మెడికవర్‌లో కార్నియా శస్త్రచికిత్సల పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
- సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం
- భారత్‌లోని విదేశీ పౌరులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనల సడలింపు
- ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్
- బహ్రెయిన్ విమానాశ్రయ భద్రతా మరింత పటిష్టం..!!







