సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!
- November 07, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ట్యాక్సీ సేవలు, ప్రైవేట్ కార్ రెంటల్ సంస్థలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ సేవల్లో వినియోగించే వాహనాల గరిష్ఠ నిర్వహణ కాలపరిమితిని మరో ఆరు నెలల వరకు పొడిగించింది. దీంతో 2026 చివరి నాటికి గడువు ముగిసే వాహనాలను 2027 జూన్ 30 వరకు వినియోగించుకునేందుకు అనుమతి లభించింది.
సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ట్యాక్సీ సేవలు, ప్రైవేట్ కార్ల అద్దె కార్యకలాపాల్లో ఉపయోగించే వాహనాలకే ఈ పొడిగింపు వర్తిస్తుంది. 2026 డిసెంబర్ చివరితో అనుమతించిన నిర్వహణ కాలపరిమితి ముగిసే వాహనాలకు అదనంగా ఆరు నెలల గడువు కల్పించారు. వాహనాలను మార్చాల్సిన అవసరం వల్ల సంస్థలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు రవాణా సేవల్లో అంతరాయం లేకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని TGA వెల్లడించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలను మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పేర్కొంది. రవాణా రంగానికి సంబంధించిన నిబంధనలను మెరుగుపరచడం, సేవల నిరంతర కొనసాగింపునకు ప్రోత్సాహం అందించడం, ఈ రంగం దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడటంలో భాగంగానే గడువు పొడిగించినట్లు ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ వివరించింది.
తాజా వార్తలు
- ‘ఫౌండాయో’కు యూఏఈ ఆమోదం.. ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు..!!
- ముంబై, మస్కట్ ప్రయాణికులపై అదనపు భారం..!
- సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!
- దీపావళి క్రాకర్స్ షాపులకు GHMC కొత్త రూల్స్..
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్
- భారతీయుడికి వైద్య అత్యవసర పరిస్థితి.. హెలికాప్టర్లో తరలించిన ఒమన్ వైమానిక దళం
- ఢిల్లీలో వాయు కాలుష్యం.. అమల్లోకి మూడో దశ ఆంక్షలు







