ఢిల్లీలో వాయు కాలుష్యం.. అమల్లోకి మూడో దశ ఆంక్షలు

- November 06, 2026 , by Maagulf
ఢిల్లీలో వాయు కాలుష్యం.. అమల్లోకి మూడో దశ ఆంక్షలు

న్యూ ఢిల్లీ: ఢిల్లీ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తోంది. రాబోయే దీపావళి పండుగ వేళ వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉండటంతో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు దిల్లీ-ఎన్సీఆర్ వ్యాప్తంగా ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్స‌ స్టేజి-III ఆంక్షలను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది.

నివేదికల ప్రకారం దిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 382 మార్కును తాకి ‘చాలా అధ్వాన’ (Very Poor) కేటగిరీకి చేరింది. రోహిణి, ఐఐటీ దిల్లీ, పంజాబీ బాగ్ వంటి పలు కాలుష్య పరిశీలన కేంద్రాల్లో ఏక్యూఐ 400 మార్కు దాటి ‘తీవ్ర’ స్థాయిని నమోదు చేసింది.

సగటున ఏక్యూఐ 301-400 మధ్య ఉంటే ‘బాగా తక్కువ’గా భావిస్తారు. కాలుష్యం మరింత తీవ్రమై 401 దాటే సూచనలు కనిపిస్తే గ్రాప్-3 ఆంక్షలను అమల్లోకి తెస్తారు. పండుగ పటాకుల వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారే ముప్పు ఉండటంతో అధికారులు ముందస్తుగా ఈ నిబంధనలను విధించారు.

గ్రాప్-3 కింద అమలులో ఉండే నిషేధాలు
అత్యవసరం కాని భవన నిర్మాణాలు, కూల్చివేతలు, తవ్వకాలు, కంకర రోడ్లపై నిర్మాణ సామగ్రి తరలింపుపై పూర్తి నిషేధం విధించారు. అదేవిధంగా బీఎస్-3 పెట్రోల్ కార్లు, బీఎస్-4 డీజిల్ కార్ల రాకపోకలపై కఠిన పరిమితులు అమలవుతాయి. ధూళి కాలుష్యాన్ని పెంచే స్టోన్ క్రషర్లు, గనుల తవ్వకాలు తక్షణమే నిలిపివేయబడతాయి.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పాత మోటారు రవాణా డీజిల్ వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేశారు.

ప్రజలకు లభించే మినహాయింపులు ఇవే
రోడ్లపై ప్రైవేట్ వాహనాల సంఖ్య తగ్గించేందుకు మెట్రో రైళ్లు, సిటీ బస్సుల ట్రిప్పులను పెంచాలని అధికారులకు సూచించారు. ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులకు బదులుగా హైబ్రిడ్ లేదా ఆన్‌లైన్ బోధన ఎంచుకునేందుకు పాఠశాలలకు అనుమతి ఇచ్చారు.

రవాణా, ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల సంబంధిత ప్రాజెక్టులు ధూళి నిరోధక నిబంధనలతో పనులు చేసుకోవచ్చు. వాయు కాలుష్యం శ్వాసకోశ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉన్నందున చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com