దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- November 07, 2026
దుబాయ్: ప్రముఖ లగ్జరీ వాచ్ బ్రాండ్ పటెక్ ఫిలిప్ (Patek Philippe) పేరుతో నకిలీ వాచ్‌ను అసలైనదిగా నమ్మించి విక్రయించిన మహిళకు దుబాయ్ కోర్టు జరిమానా విధించింది. కొనుగోలుదారుడి నుంచి తీసుకున్న Dh700,000 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
దుబాయ్ మిస్డిమీనర్ కోర్టు నిందితురాలిని దోషిగా నిర్ధారించి Dh10,000 జరిమానా విధించింది. అంతేకాకుండా నకిలీ వాచ్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. సదరు వ్యక్తి ఆ వాచ్ అసలైనదని నమ్మి Dh700,000 చెల్లించి కొనుగోలు చేశాడు. అయితే ఆ తర్వాత అది నకిలీదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో కొనుగోలుదారుడిని వాచ్ అసలైనదేనని నమ్మించి మోసం చేసినట్లు కోర్టు నిర్ధారించింది.
తొలుత వెలువడిన తీర్పును మహిళ సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లింది. అయితే ఆమె అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. అనంతరం కోర్ట్ ఆఫ్ కసేషన్‌ను ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో క్రిమినల్ కోర్టు తీర్పు తుది నిర్ణయంగా మారింది. మరోవైపు తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని తిరిగి పొందేందుకు కొనుగోలుదారుడు సివిల్ కోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసులో దుబాయ్ సివిల్ కోర్టు మహిళ Dh700,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. సివిల్ కోర్టు తీర్పు వెలువడిన తేదీ నుంచి మొత్తం చెల్లించే వరకు ఏటా 5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులు, న్యాయపరమైన వ్యయాలను కూడా ఆమె భరించాలని ఆదేశించింది.
మహిళ మోసపూరిత చర్యకు, కొనుగోలుదారుడికి జరిగిన ఆర్థిక నష్టానికి ప్రత్యక్ష సంబంధం ఉందని సివిల్ కోర్టు పేర్కొంది. క్రిమినల్ కేసులో జరిమానా, నకిలీ వస్తువు స్వాధీనం వంటి చర్యలు తీసుకోగా, సివిల్ కేసులో బాధితుడికి డబ్బు తిరిగి ఇప్పించేలా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







