ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!

- November 07, 2026 , by Maagulf
ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!

మస్కట్: ఒమన్‌లో అక్రమంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆసియా దేశానికి చెందిన ఓ ప్రవాస వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్ దహిరా గవర్నరేట్‌లోని పెట్రోలియం రాయితీ ప్రాంతంలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్‌స్టాలేషన్స్ సెక్యూరిటీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిందితుడి వద్ద పెద్ద మొత్తంలో సిగరెట్లు, నమిలే పొగాకు ఉత్పత్తులు గుర్తించారు. వీటిని అక్రమంగా తరలించి విక్రయించాలనే ఉద్దేశంతో తన వద్ద ఉంచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్ పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com