కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!

- November 07, 2026 , by Maagulf
కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!

కువైట్ : కువైట్‌లో చోరీకి గురైన ఓ ఫోర్ వీల్ డ్రైవ్ (4WD) వాహనాన్ని భద్రతా సిబ్బంది జాబ్రియా ప్రాంతంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ మిషన్స్ యూనిట్‌కు చెందిన భద్రతా పెట్రోలింగ్ బృందం జాబ్రియాలోని ఓ ఖాళీ స్థలంలో అనుమానాస్పదంగా నిలిపి ఉన్న వాహనాన్ని గుర్తించింది. 

వాహనంపై ఇసుక పేరుకుపోయి ఉన్నప్పటికీ అది మంచి స్థితిలో ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వాహనం రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించగా, అహ్మదీ గవర్నరేట్‌కు చెందిన యజమాని గతంలో అది చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

వాహనం ఎలా చోరీకి గురైందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దొంగిలించే సమయంలో వాహనం ఇంజిన్ ఆన్‌లో ఉందా? లేక మరో విధానంలో చోరీ చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

వాహనంలో వేలిముద్రలు సేకరించి నిందితులను గుర్తించేందుకు ఫోరెన్సిక్ విభాగానికి అప్పగించారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత వాహనాన్ని అసలు యజమానికి తిరిగి అప్పగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com