రాందేవ్ బాబా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని నిర్మించతలపెట్టారు..
- August 28, 2016
యోగా గురువు రాందేవ్ బాబా దేశంలో రాకెట్ వేగంతో దూసుకువెళుతున్నారు. యోగా కార్యక్రమ నిర్వహణలో అగ్రభాగాన ఉన్న ఆయన ఇక వాణిజ్య విభాగంలో కూడా దూసుకెళ్లారు. ఇక తాజాగా ఆయన విద్యారంగంవైపు దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో రాందేవ్ బాబా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే 1,500 ఎకరాల భూమిని కూడా సిద్ధం చేసి ఉంచారట. దాదాపు లక్షమంది విద్యార్థులకు వివిధ విభాగాల ద్వారా అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ఆయన ఈ వర్సిటీని స్థాపించనున్నారట.హ్యూస్టన్ లో ఈ నెల 23న నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాందేవ్ త్వరలోనే ఢిల్లీకి అతి సమీపంలో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ తరహాలో వరల్డ్ క్లాస్ వర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించారు.దీనికోసం ఆయన రూ.25,000 కోట్లు వెచ్చించనున్నారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి విలువలతో విద్యను బోధించారో అలాంటి విద్యనే ఇక్కడే బోధిస్తామని రాందేవ్ చెప్పారు. గురుకుల విద్యకు ప్రాణంపోయాలని తాను ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, మానవ వనరుల శాఖకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







