‘DNK’ ‘లిటిల్ హార్ట్స్’ కంటే పెద్ద విజయం సాధించాలి: హీరో శ్రీవిష్ణు

- November 12, 2026 , by Maagulf
‘DNK’ ‘లిటిల్ హార్ట్స్’ కంటే పెద్ద విజయం సాధించాలి: హీరో  శ్రీవిష్ణు

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా  గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అలీ గారు ఇలాంటి మంచి పాత్రల్లో కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా యంగ్ టీమ్ కలిసి చేసిన సినిమా ‘DNK’. మౌళి చాలా నీట్‌గా ప్లాన్ చేసుకుని ఈ సినిమా చేశాడు. తనకు అన్ని క్రాఫ్ట్స్‌పై మంచి అవగాహన ఉందని ఈ మధ్యే తెలిసింది. మౌళిది మా జిమ్మే.  జిమ్‌లో ఉన్న ప్రతి మెషీన్‌ను టచ్ చేస్తాడు. (నవ్వుతూ) ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూసిన తర్వాత నవ్వుతూనే ఉన్నాను. ‘DNK’ కూడా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అనిల్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి మూటలు మూటలుగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుంది. సినిమా నవంబర్ 13న విడుదలవుతోంది. పెద్దలు అందరూ చూడండి. 14న పిల్లలందరినీ తీసుకెళ్లండి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి. పెద్ద హిట్ చేయండి. థాంక్యూ వెరీ మచ్.

హీరో మౌళి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శ్రీ విష్ణు, ఎస్‌కేఎన్ కి పేరుపేరునా ధన్యవాదాలు. మైత్రీ మూవీ మేకర్స్ అనిల్, చెర్రీ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పటికీ, నేను ఎప్పుడు కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు. వాళ్లకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు. ఎంతో ఆప్యాయంగా ఉంటారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. డైరెక్టర్ గారు చాలా ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్ తీసుకొచ్చారు. కచ్చితంగా ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నవంబర్ 13న అందరూ థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలీ, రజిత, ప్రియ ఎంతో సీనియర్స్ అయినప్పటికీ మాకు ఎంతగానో సహకరించారు. అలాగే హీరోయిన్ సుస్మితకు కూడా ధన్యవాదాలు. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. డీవోపీ సూర్య ఈ సినిమాకు మరో సపోర్ట్‌గా నిలిచారు. సింజిత్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ సినిమాలాగే భావించి పనిచేశారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ శ్రీను కంబాల మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్స్‌లో నా తొలి సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. మౌళి ఈ కథ చెప్పిన తర్వాత నా జీవితమే మారిపోయింది. మా డీఓపీ, ఇతర టెక్నీషియన్లు అందరూ బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు. ఈ వేడుకకు వచ్చిన బుచ్చిబాబు, శ్రీ విష్ణు కి పేరుపేరునా ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాలో అలీ, రజిత , ప్రియ  వంటి చాలామంది సీనియర్ నటులతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. వారందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. ప్యాషన్‌తో ఇక్కడి వరకు వచ్చాను. నవంబర్ 13న నా మూమెంట్ రాబోతోంది. సినిమా అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశాను. సినిమా చూడకపోతే మౌళి మీద ఒట్టు( నవ్వుతూ).

డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇందులో నటించిన జయకృష్ణ ‘ఉప్పెన’ సినిమాలో నటించాడు. ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’తో మంచి బ్రేక్ వచ్చింది. అలాగే అలీ, రజిత సహా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు.  ఉప్పెన హిట్ అయితేనే చిన్న సినిమాలు చేస్తానని రవి చెబుతుండేవారు. చిన్న సినిమాలు కోసం పెద్ద  విజయం సాధించాలని నేను ఎప్పుడూ కోరుకునేవాడిని. ఈ సినిమా కూడా ‘ఉప్పెన’ అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘లిటిల్ హార్ట్స్’ విజయం సాధించిన తర్వాత మౌళి తన పేరెంట్స్‌ను చూసుకున్న పద్ధతి చూసి చాలా ఎమోషనల్‌గా అనిపించింది. మౌళి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ‘DNK’ అనే టైటిల్ ఈ సినిమాకు సరిగ్గా నప్పుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవి మాకు ఫ్యామిలీ లాంటి వారు.  ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌కు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ శివ నిర్మాణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. మౌళి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. తన మాటలు కూడా చాలా జెన్యూన్‌గా ఉంటాయి. మౌళి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. ‘లిటిల్ హార్ట్స్’ లాగే ‘DNK’ కూడా చాలా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను. ఒక యంగ్ టాలెంట్ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే సినిమా ఇండస్ట్రీ కూడా నిత్యనూతనంగా ఉంటుంది. ట్రైలర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ సుస్మిత శెట్టి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మౌళి, సుస్మిత జోడీ చాలా క్యూట్‌గా ఉంది. ‘లిటిల్ హార్ట్స్’ లాగే ఈ సినిమా కూడా రెండు రాష్ట్రాల్లో చిన్న సినిమా నుంచి పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్‌లో ఏ సినిమా విజయవంతమైనా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇండస్ట్రీలో సగం అవకాశాలు మైత్రి మూవీ మేకర్స్ నుంచే వస్తున్నాయి. ఇండియాలోనే నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదుగుతున్న మైత్రి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మనందరం గర్వించాల్సిన విషయం. మీడియా మిత్రులు ఈ సినిమాకు ప్రత్యేకంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.

డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ..‘లిటిల్ హార్ట్స్’ విడుదలైన సమయంలో మౌళిని, నన్ను నవీన్ గారు పిలిచి చెక్ ఇచ్చారు. ఇప్పుడు ఏడాదిలోపే మౌళి మరో సినిమా తీశాడు.  మౌళి, నేను కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ వేడుకలో అందరూ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ‘లిటిల్ హార్ట్స్’ కంటే చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శ్రీవిష్ణు గారికి, వివేక్ ఆత్రేయ గారికి, ఎస్‌కేఎన్ గారికి పేరుపేరునా ధన్యవాదాలు. మౌళి ఈ సినిమాను దగ్గరుండి చూసుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తానని, తనకు ఫ్రీడమ్ ఇవ్వాలని అడిగాడు. తన ‘లిటిల్ హార్ట్స్’ అద్భుతమైన సినిమా. మౌళి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. పూర్తి బాధ్యతను తనకు అప్పగించాం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇది చాలా పెద్ద విజయం సాధిస్తుందని చెబుతున్నారు. నాకు కూడా ఆ నమ్మకం ఉంది. మాకు ఏదైతే ప్రామిస్ చేశాడో అదే ఇచ్చాడు. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

హీరోయిన్ సుస్మిత శెట్టి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా తొలి సినిమా. నా ఫస్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌తో చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో చాలామంది సీనియర్ యాక్టర్స్‌తో కలిసి నటించే అవకాశం దొరికింది. మౌళితో కలిసి పనిచేయడం చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. నవంబర్ 13న ఈ సినిమా విడుదలవుతోంది. అందరూ మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమిల్లి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మౌళి, మిగతా నటీనటులందరూ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాలు నిర్మించే ఒక బ్యానర్, అప్‌కమింగ్ టాలెంట్‌తో కూడా అంతే ప్యాషన్‌తో సినిమా చేయడం మైత్రి మూవీ మేకర్స్‌కే సాధ్యం. ఈ సందర్భంగా నవీన్ గారికి, రవి గారికి అభినందనలు. మౌళికి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. తను ఎక్కడ ఉంటే అదే తనకు గ్రౌండ్. ఈ సినిమాతో మరింత పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ సుస్మిత శెట్టికి కూడా మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను. ఈ సినిమాతో పాటు విడుదలవుతున్న మిగతా సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలో సందడి చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ అంతా అంత అద్భుతంగా ఉంటుంది.

అలీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ పెద్దపెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు. అలాంటి సంస్థ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను కూడా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. మౌళి, డైరెక్టర్ గారు ఈ సినిమాను భుజాన వేసుకుని చాలా అద్భుతంగా రూపొందించారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని, తద్వారా మళ్లీ చిన్న సినిమాలకు మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను.
మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమాలు చేయడం వల్ల టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. వారి ఆశీర్వాదమే విజయాల రూపంలో వారికి తిరిగి వస్తోంది.

రజిత మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్‌లో ‘జనతా గ్యారేజ్’, ‘వీరసింహారెడ్డి’, ‘శ్రీమంతుడు’ లాంటి పెద్ద సినిమాల్లో నటించాను. చాలా రోజుల తర్వాత మైత్రి సంస్థలో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను.మైత్రి మూవీ మేకర్స్‌కు, మా డైరెక్టర్ కి, ఈ సినిమాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మౌళి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇది చాలా మంచి ఎంటర్‌టైనర్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వేడుకలో యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com