అమెజాన్ పే ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’
- November 11, 2026
పర్యాటక ప్రియులకు, పండుగలు మరియు సెలవుల సీజన్లో ప్రయాణ ప్రణాళికలు వేసుకుంటున్న వారికి అమెజాన్ పే తీపి కబురు అందించింది. ప్రముఖ సేల్ ఈవెంట్ ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’ను ప్రకటించింది. ఈ సేల్ నవంబర్ 12 నుంచి నవంబర్ 26 వరకు మొత్తం 15 రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. ఈ మెగా సేల్‌లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 30% వరకు, హోటల్ రిజర్వేషన్లపై ఏకంగా 65% వరకు భారీ తగ్గింపులను అందిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్, ముంబై నుంచి దుబాయ్, కోల్‌కతా నుంచి హో చి మిన్ సిటీ వంటి అంతర్జాతీయ మార్గాలతో పాటు ముంబై-గోవా, బెంగళూరు-కొచ్చి వంటి దేశీయ మార్గాల్లో ఆకర్షణీయమైన ప్రారంభ ధరలకే టికెట్లు లభిస్తాయి. అంతేకాకుండా, దుబాయ్, సింగపూర్ సహా పలు ప్రపంచ ప్రసిద్ధ నగరాల్లోని 5-స్టార్ హోటళ్లలోనూ రాయితీ ధరల్లోనే బస చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు.
అదనపు క్యాష్‌బ్యాక్, ప్రత్యేక ప్రయోజనాలు.. నవంబర్ 12 నుంచే ఎర్లీ బర్డ్ ఆఫర్లు!
ఈ సేల్‌లో ప్రయాణికులకు తక్షణ తగ్గింపులతో పాటు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే ప్రైమ్ సభ్యులకు 5% అదనపు క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ సభ్యులకు 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే బస్ టికెట్ బుకింగ్‌లపై 17% వరకు తగ్గింపుతో పాటు ₹100 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ముఖ్యంగా నవంబర్ 12, 13 తేదీల్లో ప్రారంభమయ్యే ‘ఎర్లీ బర్డ్ ఆఫర్ల’లో భాగంగా విమానాలపై గరిష్టంగా ₹500 వరకు, హోటళ్లపై గరిష్టంగా ₹10,000 వరకు 10% క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చని అమెజాన్ పే పేమెంట్స్ డైరెక్టర్ గిరీష్ కృష్ణన్ తెలిపారు. 24/7 కస్టమర్ సపోర్ట్, తక్కువ క్యాన్సిలేషన్ ఛార్జీలు మరియు ‘బుక్ నౌ పే లేటర్’ వంటి సౌకర్యాలతో Amazon.in యాప్ లేదా వెబ్‌సైట్‌లోని ట్రావెల్ విభాగం ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్లు, క్షిపణుల దాడి యత్నం.. ధ్వంసం చేసిన సంకీర్ణ దళాలు
- అమెజాన్ పే ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’
- ‘దుబాయ్-ఇట్ అవార్డులు’ విజేతలకు షేక్ హమ్దాన్ సత్కారం..13 మందికి పురస్కారాలు
- యుద్ధ సమయాల్లో ఆసుపత్రులపై సైబర్ దాడుల ముప్పు.. బుర్జీల్ హోల్డింగ్స్ ఛైర్మన్ హెచ్చరిక
- ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రకటించిన విజయసాయిరెడ్డి
- బాండ్‌బజార్ నూతన సీఈఓగా ఎస్.శంభత్ కుమార్ నియామకం!
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!







