నకిలీ అటెస్టేషన్ సేవల పై భారతీయులకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక
- November 11, 2026
రియాద్: సౌదీ అరేబియాలో నకిలీ అటెస్టేషన్ సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అనధికారికంగా అటెస్టేషన్ సేవలు అందిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.
పత్రాల అటెస్టేషన్ సేవలను భారత రాయబార కార్యాలయంలోని కాన్సులర్ అధికారులు మాత్రమే నిర్వహిస్తారని స్పష్టం చేసింది. ఇందుకోసం అధికారికంగా నియమించిన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లైన వీఎఫ్ఎస్ గ్లోబల్ (VFS Global) ద్వారా లేదా భారత రాయబార కార్యాలయం నిర్వహించే కాన్సులర్ క్యాంపుల ద్వారా మాత్రమే ఈ సేవలు పొందాలని సూచించింది.
అటెస్టేషన్ సేవల కోసం అపాయింట్‌మెంట్లను వీఎఫ్ఎస్ గ్లోబల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. సౌదీ అరేబియాలో అటెస్టేషన్ సేవలకు వీఎఫ్ఎస్ గ్లోబల్ మాత్రమే అధికారికంగా నియమించబడిన సంస్థ అని స్పష్టం చేసింది. అనధికారిక ఏజెంట్లను ఆశ్రయించవద్దని భారతీయులకు సూచించింది.
యూఏఈలోనూ వీసా, మైగ్రేషన్ ఏజెన్సీలపై హెచ్చరిక
ఇదిలా ఉండగా, యూఏఈలోనూ వీసా, మైగ్రేషన్ సేవల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్య కార్యాలయాలు గతంలో భారతీయులకు సూచించాయి.
విదేశాల్లో ఉద్యోగాలు, రెసిడెన్సీ పర్మిట్లు ఇప్పిస్తామంటూ హామీలు ఇస్తున్న కొన్ని వీసా, మైగ్రేషన్ ప్రాసెసింగ్ ఏజెన్సీలపై భారతీయుల నుంచి ఫిర్యాదులు అందినట్లు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్‌లోని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించాయి.
కొన్ని ఏజెన్సీలు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేసినప్పటికీ, హామీ ఇచ్చిన సేవలను అందించడం లేదని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపాయి.
ఈ నేపథ్యంలో ఏదైనా సేవ కోసం డబ్బులు చెల్లించే ముందు సంబంధిత ఏజెన్సీల విశ్వసనీయత, అధికారిక గుర్తింపును నిర్ధారించుకోవాలని భారతీయులకు సూచించాయి. వీసా, మైగ్రేషన్, కాన్సులర్ సేవల కోసం గుర్తింపు పొందిన సంస్థలు, అధికారిక మార్గాలనే వినియోగించాలని కోరాయి.
నకిలీ ఏజెంట్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లను నేరుగా సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని దౌత్య కార్యాలయాలు సూచించాయి.
తాజా వార్తలు
- నకిలీ అటెస్టేషన్ సేవల పై భారతీయులకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక
- సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్లు, క్షిపణుల దాడి యత్నం.. ధ్వంసం చేసిన సంకీర్ణ దళాలు
- అమెజాన్ పే ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’
- ‘దుబాయ్-ఇట్ అవార్డులు’ విజేతలకు షేక్ హమ్దాన్ సత్కారం..13 మందికి పురస్కారాలు
- యుద్ధ సమయాల్లో ఆసుపత్రులపై సైబర్ దాడుల ముప్పు.. బుర్జీల్ హోల్డింగ్స్ ఛైర్మన్ హెచ్చరిక
- ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రకటించిన విజయసాయిరెడ్డి
- బాండ్‌బజార్ నూతన సీఈఓగా ఎస్.శంభత్ కుమార్ నియామకం!
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ







