పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ వేగానికి పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు

- November 12, 2026 , by Maagulf
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ వేగానికి పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వ్యాపార నిర్వహణ సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అమలులో చూపుతున్న వేగంపై ప్రముఖ కంపెనీల సీఈఓలు, సీఎండీలు ప్రశంసలు కురిపించారు.

31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, వ్యాపార అనుకూల వాతావరణం తదితర అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును కంపెనీల ప్రతినిధులు అభినందించారు.

ఈ సమావేశంలో హీరో గ్రూప్, భారత్ బయోటెక్, అపోలో, సన్ ఇంటర్నేషనల్, రీన్యూ, రాక్‌వెల్ ఆటోమేషన్, జీఎంఆర్ గ్రూప్ తదితర ప్రముఖ సంస్థల సీఈఓలు, ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పారిశ్రామిక సంస్థల నుంచి సానుకూల స్పందన లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com