సౌదీ భద్రతే బహ్రెయిన్, జీసీసీ దేశాల భద్రత..!!
- November 12, 2026
మనామా: సౌదీ అరేబియా భద్రత, సార్వభౌమత్వం బహ్రెయిన్‌తో పాటు గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల భద్రతలో అంతర్భాగమని బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా స్పష్టం చేశారు. సౌదీ అరేబియాకు బహ్రెయిన్ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జీసీసీ సుప్రీం కౌన్సిల్ ప్రస్తుత సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కింగ్ హమద్.. 43వ జీసీసీ అంతర్గత వ్యవహారాల మంత్రుల సమావేశం సందర్భంగా సభ్య దేశాల మంత్రులు, జీసీసీ సెక్రటరీ జనరల్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సౌదీ అరేబియా సార్వభౌమత్వం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు ఆ దేశం తీసుకుంటున్న అన్ని చర్యలకు బహ్రెయిన్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. సౌదీ పౌరులు, నివాసితుల రక్షణకు, ఆత్మరక్షణ హక్కుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాపై హౌతీ మిలీషియా కొనసాగిస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఇవి ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
ఇరాన్ దాడులను ఎదుర్కోవడంలో జీసీసీ దేశాలు ప్రదర్శిస్తున్న ఐక్యతను కింగ్ హమద్ ప్రశంసించారు. సభ్య దేశాల భద్రత, స్థిరత్వం, సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు ఎదురైనా కలిసికట్టుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి స్థాపనకు జీసీసీ చేస్తున్న కృషిని కొనియాడారు. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో సభ్య దేశాల మధ్య సమన్వయం, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో తాజా ప్రాంతీయ పరిణామాలపైనా చర్చించారు.
తాజా వార్తలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
- KD 3,000 లోపు లావాదేవీలపైనా సెంట్రల్ బ్యాంక్ నిఘా..!!
- సౌదీ భద్రతే బహ్రెయిన్, జీసీసీ దేశాల భద్రత..!!
- ఐఎండీ 2026 ఏఐ ర్యాంకింగ్స్..సత్తా చాటిన సౌదీ..!!
- దుబాయ్‌లో ప్రవాసీ భారతీయ దివస్ 2027 అధికారిక వెబ్సైట్ ప్రారంభం
- యూఏఈ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం







