దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- November 12, 2026
దోహా: భారత కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఖతార్‌లో భారత రాయబారి శ్రీకర్ కొప్పుల ఘన స్వాగతం పలికి, సాదరంగా ఆహ్వానించారు.
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లీనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2026 (ITU PP-26)**లో పాల్గొనేందుకు కేంద్ర సహాయ మంత్రి దోహా పర్యటనకు వచ్చారు.
రానున్న రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన విధానాలు, అంతర్జాతీయ సహకారం, డిజిటల్ కనెక్టివిటీ వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి.
ఈ పర్యటనతో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ రంగంలో భారత్ భాగస్వామ్యం, సహకారానికి మరింత ప్రాధాన్యత లభించనుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
- KD 3,000 లోపు లావాదేవీలపైనా సెంట్రల్ బ్యాంక్ నిఘా..!!
- సౌదీ భద్రతే బహ్రెయిన్, జీసీసీ దేశాల భద్రత..!!
- ఐఎండీ 2026 ఏఐ ర్యాంకింగ్స్..సత్తా చాటిన సౌదీ..!!
- దుబాయ్‌లో ప్రవాసీ భారతీయ దివస్ 2027 అధికారిక వెబ్సైట్ ప్రారంభం
- యూఏఈ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం







