ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!

- November 12, 2026 , by Maagulf
ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!

మస్కట్: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారనుందని ఒమన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ముసందమ్ గవర్నరేట్ తీర ప్రాంతాలు, ఒమన్ సముద్ర తీరంలో గురువారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు సముద్ర పరిస్థితులు సాధారణం నుంచి అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో అలల ఎత్తు 1.5 నుంచి 2.5 మీటర్ల వరకు ఉండవచ్చని వెల్లడించింది.

ముసందమ్ గవర్నరేట్‌తో పాటు అల్ హజర్ పర్వత ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతోపాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వాడీలు (లోతట్టు వాగులు) ప్రవహించే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉండేవారు, వాగులు ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒమన్ వాతావరణ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com