KD 3,000 లోపు లావాదేవీలపైనా సెంట్రల్ బ్యాంక్ నిఘా..!!
- November 12, 2026
కువైట్: మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారాన్ని అరికట్టేందుకు కువైట్ సెంట్రల్ బ్యాంక్ (CBK) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై KD 3,000 కంటే తక్కువ మొత్తంలో జరిగే నగదు డిపాజిట్లు, ఆర్థిక బదిలీలపైనా బ్యాంకులు నిఘా పెంచాలని ఆదేశించింది. తక్కువ వ్యవధిలో పదేపదే జరిగే లావాదేవీల్లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఒక కస్టమర్ ఒకే రోజులో KD 3,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా, లేదా అంతే మొత్తంలో నగదు బదిలీ అందుకున్నా వాటిని ప్రధానంగా పరిశీలనకు తీసుకునేవారు. అయితే, ఈ పరిమితిని తప్పించుకునేందుకు కొందరు పెద్ద మొత్తాలను చిన్న చిన్న లావాదేవీలుగా విడగొట్టి పంపిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో ఒక్కో లావాదేవీని కేవలం ఒక దినార్ తగ్గించి నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో బ్యాంకులు తమ పర్యవేక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని సమీక్షించాలని సెంట్రల్ బ్యాంక్ సూచించింది. తక్కువ వ్యవధిలో జరిగే వరుస లావాదేవీల మొత్తం విలువ, వాటి సంఖ్య, తరచుదనాన్ని పరిశీలించాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా నగదు డిపాజిట్లు లేదా బదిలీలను చిన్న మొత్తాలుగా విభజిస్తున్నారా అనే విషయాన్ని గుర్తించాలని పేర్కొంది.
అలాగే, నియంత్రణ సంస్థకు అదనపు లావాదేవీల సమాచారాన్ని అందించే ఏర్పాట్లు చేయడంతోపాటు, అనుమానాస్పద లావాదేవీలపై విచారణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని బ్యాంకులకు సూచించింది. డేటా విశ్లేషణ, అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాల గుర్తింపులో కృత్రిమ మేధ (AI) సాంకేతికతను కూడా వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
కువైట్ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, మనీలాండరింగ్ నిరోధక నిబంధనలు, ఉగ్రవాదానికి ఆర్థిక సహకార నిరోధక చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
- KD 3,000 లోపు లావాదేవీలపైనా సెంట్రల్ బ్యాంక్ నిఘా..!!
- సౌదీ భద్రతే బహ్రెయిన్, జీసీసీ దేశాల భద్రత..!!
- ఐఎండీ 2026 ఏఐ ర్యాంకింగ్స్..సత్తా చాటిన సౌదీ..!!
- దుబాయ్‌లో ప్రవాసీ భారతీయ దివస్ 2027 అధికారిక వెబ్సైట్ ప్రారంభం
- యూఏఈ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం







