ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
- November 12, 2026
మస్కట్: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారనుందని ఒమన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ముసందమ్ గవర్నరేట్ తీర ప్రాంతాలు, ఒమన్ సముద్ర తీరంలో గురువారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు సముద్ర పరిస్థితులు సాధారణం నుంచి అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో అలల ఎత్తు 1.5 నుంచి 2.5 మీటర్ల వరకు ఉండవచ్చని వెల్లడించింది.
ముసందమ్ గవర్నరేట్‌తో పాటు అల్ హజర్ పర్వత ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతోపాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వాడీలు (లోతట్టు వాగులు) ప్రవహించే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉండేవారు, వాగులు ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒమన్ వాతావరణ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
- KD 3,000 లోపు లావాదేవీలపైనా సెంట్రల్ బ్యాంక్ నిఘా..!!
- సౌదీ భద్రతే బహ్రెయిన్, జీసీసీ దేశాల భద్రత..!!
- ఐఎండీ 2026 ఏఐ ర్యాంకింగ్స్..సత్తా చాటిన సౌదీ..!!
- దుబాయ్‌లో ప్రవాసీ భారతీయ దివస్ 2027 అధికారిక వెబ్సైట్ ప్రారంభం
- యూఏఈ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం







